మరో 30 గంటలే సమయం.. ఏం జరుగుతుందో?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌కు 48 గంటల అల్టిమేటం జారీ చేశారు. 'నిర్ణీత సమయంలోగా హర్మూజ్ జలసంధిని తెరవకపోతే, ఇరాన్‌లోని అతిపెద్ద పవర్ ప్లాంట్లపై దాడి చేస్తాం' అని హెచ్చరించారు. ఫ్లోరిడాలోని తన గోల్ఫ్ క్లబ్ నుంచి ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే గడువులో 18 గంటలు ముగియగా, కేవలం 30 గంటలే మిగిలి ఉన్నాయి. ఈ హెచ్చరికతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది.