యువతిని కుటుంబసభ్యులకు అప్పగించిన పోలీసులు

VSP: టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఓ యువతి మానసిక స్థితి బాగోలేని కారణంగా ఇంటి నుంచి బయటికి వెళ్లి కనిపించకుండా పోయింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు విస్తృతంగా గాలించారు. ఆమెను గుర్తించి తిరిగి కుటుంబసభ్యులకు క్షేమంగా అప్పగించారు. కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.