VIDEO: నాసిరకంగా KGBV కాంపౌండ్ వాల్ నిర్మాణం

VIDEO: నాసిరకంగా KGBV కాంపౌండ్ వాల్ నిర్మాణం

MNCL: కన్నెపల్లి మండల కేంద్రంలోని KGBV బాలికల పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణం నాసిరకంగా సాగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏమాత్రం నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా గోడ నిర్మిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నిర్మాణాన్ని పరిశీలించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలన్నారు.