పొలంలోకి దూసుకెళ్లిన కారు

పొలంలోకి దూసుకెళ్లిన కారు

PLD: దాచేపల్లి నుంచి గురజాల వెళ్తున్న ఓ ఇన్నోవా కారు గురజాల కోల్డ్ స్టోరేజ్ వద్ద బుధవారం అదుపుతప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే కారులో ఉన్నవారిని బయటకు తీసి, వారికి సహాయం అందించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.