వైభవంగా కొండాలమ్మ జాతర మహోత్సవాలు
కోనసీమ: ముమ్మిడివరంలో వెలసిన శ్రీ కొండాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం ఉగాది రోజు నుంచి ప్రారంభమై ఈ నెల 31వ వరకు జరుగుతాయని ఆలయ కమిటీ చైర్మన్ పెట్టా శివప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిరోజు రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. ఉగాది రోజు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.