వైభవంగా గోదావరికి పుణ్య హారతి
KMM: కార్తీక మాసంలో నిన్న ఆఖరి సోమవారం సందర్భంగా భద్రాచల రామాలయం ఆధ్వర్యంలో గోదావరికి వైభవంగా పుణ్య హారతిని ఆలయ అర్చకులు అందించారు. ఆలయం నుంచి ఊరేగింపుగా నది వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేసి పసుపు కుంకుమ సమర్పించారు. మంత్రోచ్చారణ మిన్నంటగా వైదిక బృందం గోదారమ్మకు హారతి ఇచ్చి లోకం సుభిక్షంగా ఉండాలని పూజించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ దామోదర్ రావు పాల్గొన్నారు.