ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మాజీ ఎమ్మెల్యే

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మాజీ ఎమ్మెల్యే

BDK: పినపాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సామాన్య పౌరుడిగా మణుగూరు నుంచి కొత్తగూడెం వరకు ఆర్టీసీ బస్సులో స్వయంగా టిక్కెట్ తీసుకొని ప్రయాణించారు. ప్రజల నడుమ ప్రయాణిస్తూ వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. పక్కనే కూర్చున్న ప్రయాణికులతో సన్నిహితంగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.