తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన గిరిజనులు

VZM: తమ గ్రామంలో ఆదాని పవర్ ప్లాంట్ నిర్మించొద్దని సోమవారం వేపాడ మండలం మారిక గ్రామ గిరిజనులు ఏపీ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. గిరిజనులకు అన్యాయం జరిగే ఇలాంటి నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని రైతు కూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చల్లా జగన్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.