VIDEO: అమలాపురంలో మహేష్ బాబు ఫ్యాన్స్ హంగామా
కోనసీమ: అమలాపురంలో ఓ సినిమా థియేటర్ వద్ద మహేష్ బాబు అభిమాని హంగామా చేశాడు. బిజినెస్ మెన్ మూవీ రీ రిలీజ్ సందర్భంగా థియేటర్ వద్ద అతని అభిమానుల హంగామా సృష్టించారు. 'బాబులకే బాబు మహేష్ బాబు తోపు' అంటూ.. ఓ అభిమాని తలపై బీరు బాటిల్ పగలగొట్టుకుని రక్తంతో తిలకం దిద్దాడు. దీంతో అతని అత్యుత్సాహంతో జనం భయపడ్డారు. ఈ మేరకు సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.