డీఎస్సీ ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించిన కలెక్టర్

డీఎస్సీ ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించిన కలెక్టర్

ప్రకాశం: వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. రానున్న మెగా డీఎస్సీ కోసం జిల్లాలోని నిరుద్యోగులకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని ఒంగోలులోని బీసీ స్టడీ సర్కిల్లో శనివారం ఆమె ప్రారంభించారు. జిల్లా నుంచి 235 మంది శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు.