ఘనంగా బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కృష్ణా: భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మచిలీపట్నంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు తాతినేని శ్రీరాం అధ్యక్షతన ఆవిర్భవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని పార్టీ సిద్ధాంతాలకు, కార్యకలాపాలకు పునరంకితం అవ్వాలని, కృష్ణా జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తీర్మానించారు.