కలెక్టరేట్‌లో నేడు ప్రజావాణి కార్యక్రమం

WGL: ప్రజాసమస్యల పరిష్కారంలో భాగంగా వరంగల్ కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యలను విన్న వించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొనునారు.