రహదారి అంతరాయానికి స్పందించిన పోలీసులు

రహదారి అంతరాయానికి స్పందించిన పోలీసులు

WNP: గోపాల్‌పేట మండల కేంద్రం నుంచి బుద్ధారం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి SH-21పై సోమవారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి చెట్లు విరిగి రహదారిపై ప్రమాదకరంగా పడ్డాయి. దీంతో ఈ రహదారి గుండా వెళ్లే వాహనదారులకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న గోపాల్‌పేట ఎస్సై నరేష్ కుమార్ అక్కడికి వెళ్లి జేసీబీతో రహదారిపై పడి ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు.