ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు యెల్లో అలర్ట్

ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం నుంచి నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రేపు వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.