ఇబ్రహీపట్నంలో కోతుల హల్‌చల్

ఇబ్రహీపట్నంలో కోతుల హల్‌చల్

NTR: ఇబ్రహీంపట్నం మండలంలో ఎటు చూసినా కోతుల బెడద తప్పడం లేదు. ఇళ్లల్లోకి దూరి మరీ వస్తువులను ఎత్తుకుపోతున్నాయి. ఇబ్రహీంపట్నం, ఎ. కాలనీ, కొత్త గేటు, బి కాలనీలో కోతుల బెడద ఎక్కువగా ఉందని స్థాని ప్రజలు వాపోతున్నారు. కరెంటు స్తంభాలు ఎక్కి ఇళ్లల్లోకి ఉన్న కరెంటు వైర్లను లాగి పడేస్తున్నాయి. మున్సిపాలిటీ అధికారులు స్పందించి కోతుల బెడద నుంచి రక్షణ కల్పించాలంటూ కోరారు.