VIDEO: చప్టా కుంగి రాకపోకలకు అంతరాయం
ప్రకాశం: బేస్తవారిపేట మండలం బసినపల్లె గ్రామ సమీపంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వాగు ఉప్పొంగి,రహదారిపై ఉన్న చప్టా కుంగిపోయింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్రామాలమధ్య ప్రయాణించే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగు ఉద్ధృతి కారణంగా చప్టా కుంగిపోయి రోడ్డుపై నీరు నిలిచిపోయింది. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.