అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన మాజీ మేయర్
RR: మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్‌లోని బడంగ్ పేట్‌లో రాజ్యాంగ నిర్మాత డా.బి ఆర్ అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పాల్గొని ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆయన సేవలను కొనియాడారు.