ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో
ప్రకాశం: హనుమంతునిపాడులో ఎంపీడీవో రంగ సుబ్బరాయుడు ఉపాధి హామీ పనులను క్షేత్రస్థాయిలో గురువారం పరిశీలించారు. ఉపాధి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వేసవిలో ఉపాధి కూలీలు ఇబ్బందులు పడకుండా మంచినీటి వంటి సౌకర్యాలు కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్లకు ఆదేశించారు. నిర్దేశించిన సమయం ప్రకారమే పనులు జరిగేలా చూడాలని సూచించారు.