VIDEO: భారీ వర్షానికి ఈసీ నది ఉద్ధృతి

VIDEO: భారీ వర్షానికి ఈసీ నది ఉద్ధృతి

RR: రాత్రి కురిసిన భారీ వర్షానికి ఈసీ నది ఉవ్వెత్తున పొంగి ప్రవహిస్తోంది. ఈ నీరు హిమాయత్ సాగర్‌లోకి చేరడంతో ఇప్పటికే 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా నదిలోకి నీరు ఎక్కువగా వచ్చి చేరుతుండటంతో మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉంది. దీంతో ఈసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.