'ఓటర్లకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలి'
కోనసీమ: పుదుచ్చేరి, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనే ఓటర్లకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ మంగళవారం అధికారులు ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం బాధ్యత అని, సెలవు నిరాకరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, ఈ నెల 9, 23వ తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లు తమ కార్యాలయాల్లో సమాచారం అందించి సెలవు పొందవచ్చని స్పష్టం చేశారు.