'పౌరులు తమ హక్కులను పొందాలి'

SRPT: సమాజంలోని పౌరులందరూ తమ హక్కులను పొందాలని ఎస్సై గోపికృష్ణ, ఎమ్మార్వో లాలు నాయక్ అన్నారు. గురువారం పెన్ పహాడ్ మండలం చెట్ల ముకుందాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించి మాట్లాడారు.ప్రతి పౌరుడు తమ హక్కులను వినియోగించుకోవడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై అవగాహన కలిగి ఉండాలని వారు సూచించారు.