గాజంకి ప్రజలకు తప్పని నీటి కష్టాలు

CTR: కార్వేటినగరం మండలం గాజంకిలో కొన్ని రోజులుగా నీటి సమస్య ఎదుర్కొంటున్నట్లు స్థానికులు తెలిపారు. నీటి మోటారు పనిచేయకపోవడంతో ఇబ్బందిగా ఉందన్నారు. వేరే దారి లేక దూరంగా ఉన్న పొలాల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నట్లు తెలిపారు. సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు వెంటనే తమకు నీటి కష్టాలు తొలగించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.