ఖమ్మంలో ఈ నెల 13న లోక్ అదాలత్ కార్యక్రమం

KMM: ఈ నెల 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ పిలుపునిచ్చారు. చిన్నచిన్న కేసుల కోసం కోర్టుల చుట్టూ తిరిగి సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని ఆయన సూచించారు. రాజీపడదగిన క్రిమినల్, సివిల్ కేసులను పరస్పర అంగీకారంతో లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.