ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించాలి: ఎమ్మెల్యే
GDWL: ధరూర్ మండలం ర్యాలంపాడు ఆర్ & ఆర్ సెంటర్‌లో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్, పైప్‌లైన్ నిర్మాణ పనులకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదివారం భూమి పూజ చేశారు. రూ. 30 లక్షల వ్యయంతో నిర్మించనున్న 900 లీటర్ల సామర్థ్యం గల ఈ వాటర్ ట్యాంక్ పనులను ఆయన ప్రారంభించారు. ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఈ ట్యాంక్ నిర్మాణం ఎంతో అవసరమన్నారు.