చిన్నపాటి వర్షానికే RTC బస్టాండ్ జలమయం

అన్నమయ్య: పీలేరు పట్టణంలో గల ఆర్టీసీ బస్టాండ్ మొత్తం జలమయం అయింది. కొద్దిపాటి వర్షానికే మొత్తం మురికి నీటితో నిండిపోయింది. బస్టాండ్ ఆవరణం కొద్దిగా లోతులో ఉండటం వల్ల చిన్నపాటి వర్షానికే మురికినీటితో నిండిపోతోంది. దీనివల్ల ప్రయాణికులకు, వచ్చిపోయే బస్సులకు ఇబ్బందులు పడుతున్నారు. RTC చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు తెలియజేశారు.