రేపు 207 సర్పంచ్ స్థానాలకు పోలింగ్
SRD: జిల్లాలో మూడో విడత 207 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జిల్లా 17వ తేదీన నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం తెలిపారు. 1537 వార్డుల స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతుందని చెప్పారు. పోలింగ్ ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒకటి వరకు జరుగుతుందని పేర్కొన్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ నిర్వహిస్తామని చెప్పారు.