క్యాంపు కార్యాలయానికి 'ఇందిరా భవన్'గా నామకరణం

NLG: నల్గొండలోని నూతన క్యాంప్ కార్యాలయాన్ని మంత్రి కోమటిరెడ్డి ప్రారంభించారు. అనంతరం క్యాంపు కార్యాలయానికి 'ఇందిరా భవన్'గా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, జై వీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, MLC నెల్లికంటి సత్యం తదితరులు పాల్గొన్నారు.