ఏఎంసీ ఛైర్మన్ లక్ష్మికి 'మహిళా కీర్తి రత్న' పురస్కారం
కోనసీమ: మొగలికుదురు గ్రామానికి చెందిన నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ పెనుమాల లక్ష్మి మహిళా కీర్తి రత్న పురస్కారం అందుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడలో మంగళవారం జరిగిన సమావేశంలో లక్ష్మికి ఈ పురస్కారం అందించారు. శ్రీశ్రీ అంతర్జాతీయ కళా వేదిక ఛైర్మన్ కత్తిమండ ప్రతాప్ కీర్తి రత్న పురస్కారాన్ని లక్ష్మికి అందించారు.