భారీ వాహనాలకు బెంబేలెత్తిపోతున్న గ్రామస్తులు

భారీ వాహనాలకు బెంబేలెత్తిపోతున్న గ్రామస్తులు

E.G: భారీ వాహనాల వలన గోకవరం మండలం పెంటపల్లి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ప్రతిరోజు రాత్రనకా పగలనక ఈ భారీ వాహనాలు ఊరు మధ్య ఉన్న రోడ్డుపై తిరుగుటం వల్ల దుమ్ము ధూళితో గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్నారు. అంతేకాకుండా ఇరుకు రోడ్డు కావడంతో ఈ వాహనాల కారణంగా ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు.