VIDEO: ధర్వేశిపురం ఎల్లమ్మ తల్లికి మంగళ హారతి

NLG: ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయానికి మంగళవారం భక్తుల రద్దీ కొనసాగింది. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో మంగళ నిరాజనం, కుంకుమ అభిషేక పూజలను జరిపించి చీర, సారె, ఒడి బియ్యం, బోనం నైవేద్యాలను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ సిబ్బంది తగు ఏర్పాట్లు చేశారు.