అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

KMM: రాష్ట్రంలో కురుస్తున్న అతి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున ఇప్పటికే అధికారులను, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేసి రంగంలోకి దించామన్నారు. వరదలు, వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.