విద్యార్థులకు 'ఆర్థిక అక్షరాస్యత'పై అవగాహన

విద్యార్థులకు 'ఆర్థిక అక్షరాస్యత'పై అవగాహన

SDPT: బక్రీచెప్యాల పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. బ్యాంక్ కౌన్సిలర్లు పొదుపు ప్రాముఖ్యత, పిన్ నంబర్ల గోప్యత, సైబర్ మోసాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. చిన్న వయసు నుంచే బ్యాంకింగ్ వ్యవస్థపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.