VIDEO: రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు
MHBD: గంగారం మండలం మడగూడెం క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయాపడ్డారు. బుధవారం తిరుమల గండి తండాకు చెందిన బోడ వెంకన్న, తేజావత్ శ్రీహరి బ్యాంకు పనుల నిమిత్తం గంగారం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు.