జాతీయ రహదారిపై భద్రతా ఏర్పాట్లు

జాతీయ రహదారిపై భద్రతా ఏర్పాట్లు

PLD: రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు చిలకలూరిపేట–ఓడరేవు జాతీయ రహదారిపై పోలీసులు చర్యలు ప్రారంభించారు. రూరల్ సీఐ సుబ్బా నాయుడు, ఎస్సై అనిల్ పసుమర్రు పరిసరాలను పరిశీలించారు. అక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో హెచ్చరిక బోర్డులు, సిగ్నల్స్, భద్రతా ఏర్పాట్లు తప్పనిసరి చేయాలని అన్నారు. వెంటనే ప్రతిపాదనలు పంపించాలని ఎన్‌హెచ్ అధికారులకు సూచించారు.