VIDEO: రోడ్డు ప్రమాదంలో ముగ్గరికి తీవ్ర గాయాలు
అన్నమయ్య: మదనపల్లెలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అంగళ్లు ప్రాంతానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు బైకుపై మదనపల్లెకు వచ్చి, తిరుగు ప్రయాణంలో చేనేతనగర్‌లోని కళ్యాణ మండపం వద్ద వృద్ధుడిని ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులతో పాటు వృద్ధుడు గాయపడ్డాడు. వారిని మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.