నాతవరం వైద్యాధికారిగా ప్రసన్నకుమార్ బాధ్యతలు

AKP: నాతవరం పీహెచ్‌సీ వైద్యాధికారిగా డాక్టర్ ప్రసన్నకుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన అల్లూరి జిల్లా సప్పర్ల పీహెచ్‌సీ నుంచి ఇక్కడకు బదిలీపై వచ్చారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తానని తెలిపారు. గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని అన్నారు.