VIDEO: సూర్యాపేట ఏరియా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
SRPT: గత కొన్ని నెలలుగా జీతాలు రావడం లేదని సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్ద ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ఒకరు ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. దీంతో సహ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పాత జాతీయ రహదారిని దిగ్బంధించడంతో దాదాపు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు.