ర్యాగట్లపల్లిలో ఉచిత పశు వైద్య శిబిరం

ర్యాగట్లపల్లిలో ఉచిత పశు వైద్య శిబిరం

KMR: బిక్కనూర్ మండలంలోని ర్యాగట్లపల్లిలో మంగళవారం జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో, ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల పశు వైద్యాధికారి దేవేందర్ పశువులకు, గాలికుంటు నివారణ టీకాలను వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పశువులలో సోకే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భాగ్యమ్మ, రైతులు పాల్గొన్నారు.