మహిళ అదృశ్యం...!

NZB: ఎడపల్లి మండలం వడ్డేపల్లికి చెందిన కేతావత్ కవిత అదృశ్యమయ్యారు. ఈ నెల 11వ తేదీ మధ్యాహ్నం నుంచి ఆమె కనపడకపోవడంతో భర్త కేతావత్ సుక్ లాల్ శుక్రవారం ఎడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బంధువుల ఇళ్లలో వెతికినా ఎలాంటి సమాచారం లభించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమ తెలిపారు.