అగ్ని ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్
JGL: కొండగట్టులో అగ్ని ప్రమాదంలో నష్టపోయిన వారికి ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన స్థలాన్ని ఆదివారం ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన వారికి తక్షణ సహాయం కింద కుటుంబానికి రూ. 5,000 అందిస్తున్నామన్నారు. ఆయన వెంట ఆర్డీవో, తహశీల్దార్ ఉన్నారు.