ఫ్యూచర్ సిటీ.. భూ బ్యాంకుపై సర్కార్ ఫోకస్
TG: HYDలో ఫ్యూచర్‌సిటీ ఏర్పాటు చేస్తున్న ప్రాంతంలో ప్రభుత్వ, అసైన్డ్ భూములు ఎన్ని ఉన్నాయో గుర్తించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ప్రభుత్వ, అసైన్డ్, భూదాన్, సీలింగ్ భూముల రికార్డులను పరిశీలిస్తోంది. యాచారం, కందుకూరు, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మంచాల, కడ్తాల్, మాడ్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి తదితర మండలాల్లో భూ బ్యాంకును సిద్ధం చేస్తోంది.