VIDEO: అల్లినగరంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

SKLM: ఎచ్చెర్ల మండలం అల్లినగరం గ్రామంలో బుధవారం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు రేజేటి రవిబాబు విగ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేపట్టి, అనంతరం భక్తులకు వినాయకుడి కథను వినిపించారు. నవరాత్రులు ఈ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. శ్రీ శక్తి యువజన సంఘం వారు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.