మూడు రోజులు విద్యుత్ సరఫరాకు అంతరాయం

AKP: అనకాపల్లి మండలం శంకరం విద్యుత్ ఫీడర్ పరిధిలో మరమ్మతు పనులు చేపడుతున్న కారణంగా ఇవాళ నుంచి మూడు రోజుల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ అశోక్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శంకరం, గొలగాం, గోపాలపురం, రేబాక, అగ్రహారం, కొండుపాలెం, కోడూరు, భట్లపూడి గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.