'ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలి'
ADB: కష్టకాలంలో పార్టీకి అండగా ఉండి జెండా మోసిన కార్యకర్తలను గౌరవించాల్సిన బాధ్యత జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకత్వంపై ఉందని ఆదివాసీ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర వైస్‌ఛైర్మన్ సెడ్మకీ ఆనంద్ రావ్ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆదివాసీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కార్యకర్తలకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇవ్వాలని కోరారు.