జర్మనీ ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే
KMR: జర్మనీ బుండెస్టాగ్ అంతర్గత వ్యవహారాల కమిటీ పార్లమెంటరీ ప్రతినిధి బృందంతో హైదరాబాద్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో జుక్కల్ MLA లక్ష్మీ కాంత్ పాల్గొన్నారు. భారతదేశం-జర్మనీ మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడం, పరిపాలనా విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తులో భాగస్వామ్యం అవకాశాలపై సమావేశంలో చర్చించారు.