ఎండలకు బ్రేక్… గంగారంలో కురిసిన వర్షం
MHBD: గంగారం మండల కేంద్రంలో ఇవాళ మధ్యాహ్నం ఆకస్మికంగా వర్షం కురిసింది. మేఘాలు కమ్ముకొని ప్రారంభమైన ఈ వర్షం కొంతసేపు కొనసాగింది. వర్షం కారణంగా మండలంలో ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడింది. గత కొద్ది రోజులుగా పెరిగిన ఎండలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది. రైతులు కూడా ఈ వర్షంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.