రామవరంలో 'సేఫ్ మదర్‌హుడ్ డే' కార్యక్రమం

రామవరంలో 'సేఫ్ మదర్‌హుడ్ డే' కార్యక్రమం

BDK: రామవరంలో ఇవాళ ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా మాతా శిశు ఆసుపత్రిలో 'సేఫ్ మదర్‌హుడ్ డే' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు గర్భిణీలకు గర్భధారణ ముందు, ప్రసవ సమయం, ప్రసవానంతర సంరక్షణతో పాటు PCPNDT చట్టం ప్రాముఖ్యతపై, పోషణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, విద్యార్థులు, బోధకులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.