వెయ్యి స్థంభాల ఆలయాన్ని సందర్శించిన కేంద్రమంత్రి
HNK: హన్మకొండలోని చారిత్రాత్మక వెయ్యి స్థంభాల ఆలయాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ. కిషన్ రెడ్డి శనివారం సందర్శించారు. ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అభివృద్ధి పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.