ఈనెల 29న రావులపాలెంలో తైక్వాండో పోటీలు

ఈనెల 29న రావులపాలెంలో తైక్వాండో పోటీలు

కోనసీమ: రావులపాలెంలోని పోతంశెట్టి రామిరెడ్డి పార్క్ వద్ద ఈనెల 29న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి తైక్వాండో బెల్ట్ ప్రమోషన్ టెస్ట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సీనియర్ గ్రాండ్ మాస్టర్ అబ్బులు తెలిపారు. 4 భాగాలలో ప్రతిభ కలిగిన వారికి సీనియార్టీ ప్రకారంగా బెల్ట్, సర్టిఫికెట్, మెడల్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ పోటీల్లో సుమారు 120 మంది పాల్గొంటారన్నారు.