VIDEO: 'సన్నాహక సమావేశం విజయవంతం చేయాలి'
MNCL: ఈనెల 18న హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సన్నాహక సమావేశం విజయవంతం చేయాలని ఫోరం జిల్లా కన్వీనర్ కే. విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం మందమర్రిలో మాట్లాడుతూ.. ఉద్యమకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.